ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అవగాహన కార్యక్రమం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కే. శ్రీనివాసరావు అధ్యక్షోపన్యాసం చేస్తూ ప్రతి విద్యార్థి ఎన్ఎస్ఎస్ లో సభ్యులుగా చేరి సమాజ సేవలో భాగస్వాములవ్వాలని, సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బెల్లంకొండ ప్రసాద్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ (వినుకొండ), మాట్లాడుతూ విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకోవడంలో ఎన్ఎస్ఎస్ ఎంతో తోడ్పడుతుందని విద్యార్థి దశ నుండి సమాజాన్ని చైతన్య పరుస్తూ సమాజంలోని సమస్యలు, రుగ్మతలపై స్పందించే లక్షణాలను అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్ హరిబాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జి.అంజయ్య, ఐ. క్యూ. ఏ. సి. కోఆర్డినేటర్ కెవిఎస్ కోటేశ్వరరావు, అధ్యాపక సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. (Story : ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అవగాహన కార్యక్రమం)