స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ లో సత్తా చాటిన వినుకొండ నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి
న్యూస్‌తెలుగు/ వినుకొండ : ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ లో అండర్ 17 విభాగంలో వినుకొండ నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి బి. హర్ష గోల్డ్ మెడల్ సాధించాడని సిస్టర్ సెలీన్ తెలిపారు. సెప్టెంబర్ 30 న పెనుమాకలో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్ 17 విభాగంలో 100 మీటర్లు మరియు 200 మీటర్లు పరుగు పందెంలో బి హర్ష గోల్డ్ మెడల్ సాధించాడని, ఈ నెలలో శ్రీకాకుళం లో రాష్ట్రస్థాయిలో జరిగే స్కూల్ గేమ్స్ లో పాల్గొంటాడని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థి బి హర్ష ను పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ సిసిలి, ప్రిన్సిపల్ సిస్టర్ రాణి గోవిందు, సిస్టర్ బెనడిక్టా , సిస్టర్ ఎల్సి చాకో, అధెటిక్స్ కోచ్ డి అశోక్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు పవన్ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందించారు. (Story : స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ లో సత్తా చాటిన వినుకొండ నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి)