భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
జిల్లా అదనపు కలెక్టర్
న్యూస్ తెలుగు /ములుగు : అదనపు కలెక్టర్ రెవిన్యూ సి. హెచ్. మహేందర్ జి తన ఛాంబర్లో సోమవారం ములుగు తహసిల్దార్ విజయ భాస్కర్ తో కలిసి రామచంద్రాపురం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రామచంద్రాపురం గ్రామానికి చెందిన భూ సమస్యల గుర్తింపు విషయంలో గతం లో దరఖాస్తులు స్వీకరించడం జరిగినదని, దాదాపు 500 పైబడిన దరఖాస్తులు కంప్యూటరీకరణ కూడా జరిగినదన్నారు. ప్రస్తుతం గతములో దరఖాస్తులు చేయని,రైతుల యొక్క భూసమస్యలను గుర్థించుటకు, వారి నుండి మాత్రమే దరఖాస్తులను స్వీకరించుటకు గాను ,ప్రత్యేక బృందాలు రామచంద్రాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద వుండి దరఖాస్తులను స్వీకరించాలని, జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సి. హెచ్. మహేందర్ జి. తెలిపారు.ఇట్టి బృందాలు వారికి కేటాయించిన గ్రామ పంచాయతీల్లో 01-10-2024 నుండి 3.10.2024 వరకు పర్యటించి తదనంతరం చేపట్టాల్సిన చర్యలపై నివేదిక సిద్దం చేస్తారని అన్నారు.
అట్టి నివేదికల ఆధారంగా సమస్యల ను దశల వారిగా పరిశరించి భూమి పై హక్కులను కల్పించుటకు చర్యలు తీసుకోబడునని అన్నారు. కొన్ని అంశాలపై ప్రభుత్వంకు నివేదిక పంపడం జరుగుతుందని తెలిపారు. (Story : భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ)