ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.
న్యూస్ తెలుగు /ములుగు : ప్రజావాణి దరఖాస్తులను ఆలస్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు లతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.
ప్రజావాణిలో మొత్తం.51 వినతులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, డిసిఓ సర్దార్ సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తుల రవి, డి ఈ ఓ పాణిని, సి పి ఓ ప్రకాష్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి)