ఋషికొండబీచ్ లో యువకుడిని కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డు
న్యూస్‌తెలుగు/విశాఖపట్నం : విశాఖపట్నం ఋషికొండ బీచ్ లో మునిగిపోతున్న యువకుడిని జీవీఎంసీ లైఫ్ గార్డు రక్షించడమైనదని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి ఆదివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
నగరంలో గల మధురవాడకు చెందిన ఐదుగురు స్నేహితులు ఆదివారం నగరంలో ఋషికొండ బీచ్ లో సరదాగా గడిపేందుకు వచ్చారని, వారిలో మధురవాడకు చెందిన K.హేమంత్ 23 సంవత్సరాలు గల ఒక యువకుడు రిప్ కరెంటు లో పడి బీచ్ లోపలికి వెళ్ళిపోతూ మునిగిపోతున్న అతనిని నగరంలో బీచ్ ప్రాంతాల్లో నిత్యం నిఘాలో ఉంటున్న జీవీఎంసీ లైఫ్ గార్డు టి. సతీష్ గమనించి ఆ యువకుడు ను రక్షించి బయటకి తీసుకువచ్చి మిగిలిన స్నేహితులకు అప్పగించడం జరిగినదని అదనపు కమిషనర్ తెలిపారు.
విశాఖ నగరానికి విచ్చేస్తున్న సందర్శకులు,పర్యాటకులు, విహార యాత్రికులు, నగర ప్రజలు విశాఖ సముద్రతీరాలను, అందాలను తిలకిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాలన్నారు, అంతే కాకుండా సముద్రంలో స్నానాలకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని , సముద్ర తీరాలలో జీవీఎంసీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ సందర్శకులు బీచ్ లలో స్నానానికి దిగి లోతట్టు ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారని, ఎవరూ కూడా సముద్ర తీర ప్రాంతం వెంబడి బీచ్ లలో స్నానాలకు వెళ్ళి తమ ప్రాణాలకు అపాయం కలిగించుకోరాదని అదనపు కమిషనర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. (Story : ఋషికొండబీచ్ లో యువకుడిని కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డు)