నిఘా నిడలో ఏటుర్ నాగారం
33 సీసీ కెమెరాలు ఏర్పాటు
ఏటూరు నాగారం ఎస్సై ఎస్ కె.తాజుద్దీన్.
న్యూస్ తెలుగు / ములుగు : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రo తొ పాటు మండలంలోని ఆయా గ్రామలు ప్రధాన కూడలిలో పోలీస్ నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి 36 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక ఏటూరునాగారం ఎస్ ఐ. ఎస్ కె. తాజ్ ద్దీన్ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఎస్. ఐ తాజ్ ద్దీన్ మాట్లాడుతూఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీస్ లతో సమానం అని, నేరాలు నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. ఏటూరు నాగారం ఏ ఎస్పీ శివ ఉపాధ్యాయ అదేశాల మేరకు, సిఐ అనుముల శ్రీనివాస్ సూచనలతో మండలంలో సి సి కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో సైతం, సరిహద్దు ప్రాంతాలలో సైతం, సీసీ కెమెరాలు ఏర్పాటు, చేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనునిత్యం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ, ప్రజారక్షణ ద్వేయంగా,ప్రజలతో మమేకమవుతూ, ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరిస్తూ, నేరాలను నియంత్రించడం కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉండి పనిచేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని,ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, తమకు సమాచారం అందించాలని, 100 డయల్ నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు. యువత క్షణకావేశాలకు, లోనై తమ బంగారు భవిష్యత్తును, డ్రగ్స్ మత్తు పదార్థాలకు అలవాటై, తమ జీవితాలు నాశనం చేసుకోవద్దఅన్నారు. ప్రతి కదలికలను నిఘ నేత్రం తొ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.(Story:నిఘా నిడలో ఏటుర్ నాగారం)