ఘనంగా ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ఎమ్మెల్సీ దండే విఠల్
న్యూస్‌తెలుగు/ కొమరం భీం /ఆసిఫాబాద్ జిల్లా : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమానికి ఆదిలాబాద్ శాసనమండలి సభ్యులు దండే విఠల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత అని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, కొమురం భీం వంటి మహనీయులు ఆసిఫాబాద్ ప్రాంతవాసులు కావడం గర్వంగా ఉందని, ప్రజల కోసం సాగించిన పోరాటాలు సదాస్మరణీయమని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి ఆదర్శంగా నిలిచారని అన్నారు. వాంకిడి మండల కేంద్రంలో బాపూజీ పేరిట స్మృతి వనం, విగ్రహా ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు (Story : ఘనంగా ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు )