స్వచ్చత సేవా పక్షోత్సవాలలో విస్తృతంగా పాల్గొనాలి
పరిసరాలు పరిశుభ్రత పెట్టుకోవాలి
మొక్కలను నాటాలి
విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందాలి
అభివృద్ది పనులను త్వరితగతిన ప్రారంభించాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్
న్యూస్ తెలుగు /ములుగు : స్వచ్చత సేవా పక్షోత్సవాలలో విస్తృతంగా పాల్గొని పరిసరాలు పరిశుభ్రత, మొక్కల నాటి సంరక్షించడం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అన్నారు.
గురువారం ములుగు మండలంలోని మల్లంపల్లి పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్చత సేవా హీ కార్యక్రమం క్రింద నిర్వహించిన ఇండోర్ గేమ్స్ చెస్ క్యారమ్స్ పోటీలలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు. విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రత పెట్టుకోవాలని ఆన్నారు. ప్రభుత్వం విద్యకోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే అన్నారు. విద్యార్థులకు లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ దిశగా చదువు సాగించాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. విద్యార్థులకు క్యారియర్ గైడెన్స్ ఒరిఎంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం అందిస్తున్న తీరును అడిగి విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన జరగాలని సూచించారు.
అంతకుముందు మల్లంపల్లి గ్రామపంచాయితీ ఆవరణంలో ఉన్న
మార్కెట్ స్థలంను, పశువుల సంత స్థలం ను, అనంతరం జంగలపల్లిలోని మార్కెట్ స్థలంను, పశువుల సంత స్థలంను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడ ఉన్న షేడ్ లను ఉపయోగంలోకి తీసుకొని రావాలని సూచించారు. రోడ్డు మీద పేదవారు చిన్న చిన్న టెంట్లు వేసుకొని వ్యాపారం చెయడం వలన ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందని, అమ్ముకొని వారికి ఇబ్బందులు కలగకుండా అదనంగా షెడ్స్ నిర్మిచుటకు ఎన్ని షేడ్స్ అవసరం ఉన్నవి ప్రతిపాదనలు సమర్పించాలని, వర్షపు నీరు నిలువ ఉండకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలని, మార్కెట్ పశువుల సంత స్థలంలలో మొర్రం వేయించి చదును చేసి, చుట్టూ స్టెన్చ్ కొట్టించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమములో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, పాఠశాల హెచ్‌ఎం తిరుపతి, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ రాజి, ఎస్ బి ఎం జిల్లా కోఆర్డినేటర్ షర్పున్నీషా, పంచాయతీ కార్యదర్శి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. (Story : స్వచ్చత సేవా పక్షోత్సవాలలో విస్తృతంగా పాల్గొనాలి)