వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.
న్యూస్ తెలుగు /ములుగు : వచ్చే నెల 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. కోరారు.
గురువారం కలెక్టర్ తన ఛాంబర్లో వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ దివాకర టి . ఎస్. ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని వృద్ధాశ్రమాల్లో వయోవృద్ధులకు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నామని, వృద్ధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని మానసిక ఉల్లాసం పొందాలని సూచించారు. వయోవృద్ధుల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, గ్రాండ్ పేరెంట్స్ డే, వాక్ థాన్ కార్యక్రమాల్లో వృద్ధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి, ఇన్చార్జి శిరీష, వయోవృద్ధుల సంక్షేమ సంఘాల బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.