పారిశుధ్య కార్మికులు డిజిటల్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్వచ్ఛతాహి సేవ 2024 భాగంగా గురువారం వినుకొండ పట్టణంలో స్వభావ స్వచ్ఛతా- సంస్కార్ స్వచ్ఛతా అన్న నినాదంతో సైబర్ స్వచ్ఛతా, డిజిటల్ స్వచ్ఛతా కార్యక్రమం మునిసిపల్ కమిషనర్ ఎం. సుభాష్ చంద్రబోస్ నిర్వహించారు. పారిశుధ్య కార్మికులు డిజిటల్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని ,ఫ్రాడ్ అప్లికేషన్స్ జోలికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని, సెల్ వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలని పారిశుధ్య కార్మికులకు కమీషనర్ కార్యక్రమంలో భాగంగా సూచించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ సిబ్బంది , సచివాలయ సానిటేషన్ సెక్రటరీస్ ,పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. (Story : పారిశుధ్య కార్మికులు డిజిటల్ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి)