విజయవాడను స్వచ్ఛ సర్వేక్షన్‌లో అగ్రస్థానంలో నిలుపుదాం
నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ: విజయవాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షన్‌లో అగ్రస్థానంలో నిలుపుదామని నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో బుధవారం స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలపై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రెటరీ రూప మిశ్రా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులతో కలిసి పాల్గొన్నారు. స్వచ్ఛతాహి సేవలో భాగంగా నగర పాలక సంస్థలు చేపట్టాల్సిన కార్యక్రమాలు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్‌లో నగరపాలక సంస్థ అగ్రస్థానంలో ఉండాలన్నారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో నగరపాలక సంస్థ పరిధిలో గుర్తించిన క్లీన్‌నెస్ టార్గెట్ యూనిట్స్(తరచుగా పరిశుభ్రం చేయాల్సిన ప్రదేశాలు) త్వరితగతిన పరిశుభ్రపరచాలని, క్లీన్‌నెస్ టార్గెట్ యూనిట్స్‌ని లో, మీడియం, హైగా మూడు విధాలుగా విభజించి వాటికి అనుగుణంగా ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకుని అనుకున్న సమయంలో వాటిని పరిశుభ్రపర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛత హి సేవలో భాగంగా సెల్ఫీ పాయింట్స్‌ని పెట్టి ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు, స్వభావం స్వచ్ఛత, సంస్కారం స్వచ్ఛతతో సెల్ఫీ పాయింట్స్ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కేవీ.సత్యవతి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పీ.రత్నావళి, స్వచ్ఛ సర్వేక్షన్ బృందం పాల్గొన్నారు. (Story: విజయవాడను స్వచ్ఛ సర్వేక్షన్‌లో అగ్రస్థానంలో నిలుపుదాం)