UA-35385725-1 UA-35385725-1

మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల కోసం మంత్రి కార్యాలయం కొత్త సౌకర్యాలు

మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల కోసం మంత్రి కార్యాలయం కొత్త సౌకర్యాలు

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు మంత్రి కార్యాలయం ఇన్చార్జ్ హరీష్ తాజాగా ప్రత్యేక జాకెట్స్ , గ్లౌజెస్ అందించారు. హరీష్ మాట్లాడుతూ,“కార్మికుల ఆరోగ్యం అనేది ప్రాధాన్యతతో కూడుకున్న విషయం అని,అందుకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులను అందించడం మా ప్రధాన ఉద్దేశము అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ కార్మికుల పనికి ప్రాధాన్యం ఇవ్వడం, వారి శ్రేయస్సుకు కట్టుబడి ఉండడం మా లక్ష్యము అని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ఈ విధమైన కార్యక్రమాలను కొనసాగించడానికి మంత్రి కార్యాలయం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కార్యదర్శి సోమ రమేష్, కార్యాలయ సిబ్బంది, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, జింక చంద్ర, సాకే ఓబ్లేస్, తదితరులు పాల్గొన్నారు. (Story : మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల కోసం మంత్రి కార్యాలయం కొత్త సౌకర్యాలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1