రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి నుంచి ఖిల్లా ఘణపురం వెళ్లే ప్రధాన రహదారి సోలిపురం నుంచి ఖిల్లా ఘణపురం మండల కేంద్రం వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్లు భవనాల శాఖ నిధులు 6కోట్ల 60 లక్షల రూపాయలతో చేపట్టిన బీటి రోడ్డు నిర్మాణం పనులకు బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శిలాఫలకం వేశారు. పూర్తి శిధిలావస్థగా మారిన రోడ్డుపై ప్రయాణించేందుకు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయించి నేడు రోడ్డు నిర్మాణానికి తలపెట్టమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో వనపర్తి మహబూబ్నగర్ వెళ్లే ప్రధాన రహదారి సమస్యలు తీరుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు ఖిల్లా ఘనపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే)