ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రములో మాజీమంత్రి పర్యటన
పలు శుభకార్యాలతో పాటు పలువురికి పరామర్శలు
న్యూస్ తెలుగు/వనపర్తి : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనపూర్ మండల కేంద్రములో బి.ఆర్.ఎస్ నాయకులు శరత్ అన్న కూతురు డోలారోహనం(తొట్లే)కార్యక్రమములో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దివ్యాంగులు లక్ష్మమ్మ, వేంకటేశ్వర మ్మలను కలసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి, వేంకటేశ్వరమ్మ మాట్లాడుతూ మీరు మాకు గతములో ఇచ్చిన స్కూటీతో ప్రయాణాన్నికి ఏటువంటి ఇబ్బందులు లేకుండా ఉంది అని కెసిఆర్ హయాములో మాకు ఫించన్ 4000ఇచ్చి ఆదుకున్నారని కృతజ్ఞతలు తెలియజేసారు. బిఆర్ఎస్ ఉద్యమకారుడు నల్లమద్ది.రవీందర్ రెడ్డి ఇటీవల ప్రమాదానికి గురై చేతికి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. బిఆర్ఎస్ నాయకులు గోనెల.రామచంద్రయ్య అన్న వెంకటయ్య ఇటీవల మరణించారు ఇట్టి విషయం తెలుసుకున్న గౌరవ నిరంజన్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిరంజన్ రెడ్డి వెంట పార్టీ అధ్యక్షులు రాళ్ళ.కృష్ణయ్య,చిన్న ఆంజనేయులు గౌడ్,పెద్ద ఆంజనేయులు గౌడ్,శరత్ కుమార్,బాల్ రెడ్డి,రాఘవేందర్ రెడ్డి,నరేందర్,అంజిరెడ్డి,వెంకటేష్ తదితరులు ఉన్నారు.(Story:ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రములో మాజీమంత్రి పర్యటన)