Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌

2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌

0

2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌

ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు…

న్యూస్‌తెలుగు/ వినుకొండ : రానున్న రోజుల్లో దేశంలోనే అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేలా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. ఇందుకోసం స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో 2047 నాటికి విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించనున్నారని, అందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా నియోజకవర్గాల వారీగా విజన్‌ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారని అన్నారు. అప్పటి లోపుగా రాష్ట్రంలో పేదరికం అన్నదే ఉండదని, అందర్నీ కోటీశ్వరులుగానే చూడాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్షగా పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీయే 100 రోజుల పాలనపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లేలా కార్యాచరణపై ప్రధానంగా చర్చించిట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 20 నుంచి 6 రోజుల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికీ ప్రభుత్వ ప్రగతిని తెలిపేలా కార్యాచరణ చేపడతామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలకు మించి చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడాన్ని ఎమ్మెల్యేలంతా బాధ్యత గా తీసుకుంటామన్నారు. అలానే జల్‌జీవన్‌ మిషన్‌ కింద ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీళ్లు ఇస్తామని, గ్రామాల్లో రోడ్ల నిర్వహణ కోసం కేంద్రం రూ.49 వేల కోట్లు ఖర్చు పెడుతుందని ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా సంతోషం కలిగించిందన్నారు. తద్వారా కరవు పీడిత పల్నాడులో మరీ ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గంలో ఇంటింటికీ ఉచిత రక్షిత మంచినీరు ఇవ్వాలన్న తమ సంకల్పం నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇళ్లు లేని పేదలు అందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆ కల నేరుస్తామని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాల ముందుంచేలా విజన్ డాక్యుమెంట్రూ పొందించుకుంటామన్నారు. (Story : 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version