‘మార్టిన్’ లేటెస్ట్ ట్రైలర్
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా:
ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ దర్శకత్వంలో వాసవీ ఎంటర్‌ప్రైజెస్, ఉదయ్ కె.మెహతా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఉదయ్ కె.మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మించారు. రీసెంట్‌గా విడుదలైన మూవీ ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇండియన్ స్క్రీన్‌పై ఇది వరకెన్నడూ చూడని యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా మార్టిన్ నిలిచేలా ఉంది. ఈ ట్రైలర్‌లో ధృవ్ సర్జా లుక్స్, యాక్షణ్ సీక్వెన్స్, చివర్లో చెప్పిన డైలాగ్ అన్నీ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రానికి కథను అందించటం విశేషం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాటలకు సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ రవి బస్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. ఈ ట్రైలర్‌లో ఆర్ఆర్‌ను వింటే.. రవి బస్రూర్ ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టేస్తాడని అర్థం అవుతోంది. సత్య హెగ్డే విజువల్స్ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. అక్టోబర్ 11న ఈ చిత్రం మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ద్వారా నైజాంలో.. ఏపీ, సీడెడ్‌లో ఎంఎస్ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ కానుంది.