యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
న్యూస్ తెలుగు/విజయవాడ : ఈనెల 20వ తేదీ నుంచి 22 వరకు, తిరిగి 28, 29 తేదీల్లో నిర్వహించే యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్‌వో శ్రీనివాసరావు తెలిపారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లుపై స్థానిక మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డీఆర్వో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుపీఎస్సీ మెయిన్స్ నగరంలోని సీవీఆర్ అండ్ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఈనెల 20 నుంచి 22 వరకు, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 136 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారని, ఈనెల 20న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు పీపర్`1, ఎస్‌ఐ పరీక్షలను 21వ తేదీ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు, పేపర్`2లో జనరల్ స్టడీస్`1, 21 మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు, పేపర్`3లో జనరల్ స్టడీస్`2, 22న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు పేపర్`4లో జనరల్ స్టడీస్`3, 22న పేపర్`4లో జనరల్ స్టడీస్`4, తిరిగి 28న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు పేపర్`ఏలో ఇండియన్ లాంగ్వేజ్, మధ్యాహ్నాం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్`బీ ఇంగ్లీషు, 29న ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నాం 12గంటల వరకు పేపర్`6లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్`1, మధ్యాహ్నాం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్`7లో ఆప్షనల్ సబ్జెక్టు పేపర్`2 పరీక్షలను నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షల నిర్వాహణకు 7 ఇన్విజిలేటర్లును నియమించటంతో పాటు విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వాహణకు ఇద్దరేసి వెన్యూ సూపర్‌వైజర్లు, అసిసెటంట్ సూపర్‌వైజర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని మౌళిక సదుపాయాలతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో యుపీఎస్సీ జాయింట్ సెక్రటరీ సంతోష్ అజ్మీరా, అండర్ సెక్రటరీ సునీల్‌కుమార్, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. (Story : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి)