మహాలయ పక్షం వెనుక కర్ణుని కథ
మహాలయ పక్షాలు అంటే గతించిన పితృదేవతలకు సద్గతులు, కలిగించటం కోసం ఉద్దేశించిన పక్షం రోజులు. ఈ 15 రోజులు పాటు పితృదేవతలకు తర్పణం శ్రద్ధ విధులను నిర్వహించాలి, పేదలకు అన్నదానం చేయాలి. ఈ మహాలయ పక్షం రోజులు ఇంటి నందు శుభకార్యాలు నిర్వహించరాదు.
ఈ 15 రోజులు పితృదేవతలకు శ్రాధ,విధులు నిర్వహించిన పితృదేవతలు సంవత్సరం మొత్తం తృప్తి చెంది తమ వంశాభివృద్ధిని గావిస్తారని శాస్త్రవచనం. మనంశ్రాధతో ఈ 15 రోజులు పితృదేవతలను ఆరాధించిన, ఆ పితృదేవతలకు ఉత్తమ గతులు కలుగుతాయి కావున ప్రతి ఒక్కరూ ఈ మహాలయ పక్షం 15 రోజులు భక్తిశ్రద్ధలతో పితృతర్పణం శ్రాధ్ద కార్యాలు నిర్వహించడం వల్ల గతించిన పెద్దలు ఉత్తమ లోకాలను చేరుతారు.
మహాలయ పక్షాలు ఎప్పటినుండి ప్రారంభం : తెలుగు పంచాంగం ప్రకారం మహాలయ పక్షాలు సెప్టెంబర్ 18 వ తేదీ నుండి మొదలై అక్టోబర్ రెండవ తేదీ తో ముగుస్తాయి.
భూలోకానికి కర్ణుడు: మహా ధన వంతుడైన కర్ణుడు అనేక దానాలు చేసిన అన్నదానం చేయలేక పోవటం వల్ల చనిపోయిన ఉత్తమ గతి లభించలేదు, దీనికి నివారణోపాయం తెలుపమని తన తండ్రిని ప్రార్థించగా ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అది ఏమిటంటే ఇంద్రుడు కర్ణుడిని వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాత పితురులకు తర్ప నాలు, విడిచి రమ్మని పంపాడు. ఇంద్రుని సూచనలు మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరి అక్కడ పేదలకు, బంధువులకు, మిత్రులకు అందరికీ అన్నదానం చేసినాడు. పితురులకు తర్ప నాలు, వదిలాడు. తిరిగి మహాలయ అమావాస్యనాడు స్వర్గానికి వెళ్ళాడు.
ఎప్పుడైతే కర్ణుడు అన్నదానం చేశాడో అప్పుడు ఆయన కడుపునిండా ఉత్తమ గతి పొందాడు.
కర్ణుని మరణం అనంతరం తిరిగి భూలోకానికి వచ్చి భూలోకం నందు అన్నదానం చేసి గడిపి తిరిగి స్వర్గానికి వెళ్లిన ఈ పక్షం రోజులు అనగా 15 రోజులకి మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షం చివరి రోజు మహాలయ అమావాస్యగా పిలుస్తారు .
కావున మరణానంతరం సద్గతులు పొందాలంటే ఈ మహాలయ పక్షంలో తప్పక గతించిన మాత, పితురులకు, బంధువులు, స్నేహితులు, గురువులకు శ్రద్ధ కర్మలు గానీ తర్ప నాలు కానీ చేసిన వారు సద్గతి పొందుతారు. వారి ఆశీస్సులతో మనం, మన కుటుంబం, మన పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఈ మహాలయ పక్షాన్ని సద్వినియోగం చేసుకొని తరించండి. (Story : మహాలయ పక్షం వెనుక కర్ణుని కథ)
విష్ణు బోట్ల రామకృష్ణ
విజయవాడ :94406 18122