బ్యాంకింగ్ సేవలకు ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్
జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన
న్యూస్ తెలుగు/విజయవాడ : భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా స్థానిక విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్యాకింగ్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా.జీ.సృజన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ కేంద్రం ద్వారా వివిధ సేవలు పొందవచ్చని తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం నుంచి సేవలందించే ఈ ఫెసిలిటేషన్ కేంద్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు, అక్కడికక్కడే దరఖాస్తుల పరిష్కారంతో పాటు సమర్థవంతమైన ఫాలో-అప్ నిమిత్తం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ బ్యాంకుల ప్రతినిధులు ఈ కేంద్రంలో అందుబాటులో ఉండి రుణాల రీషెడ్యూల్, వినియోగ రుణాలు, మూలధన రుణాలు వంటి సేవలు పొందవచ్చని చెప్పారు. ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు ప్రక్రియతో పాటు సేవలు పొందే ప్రక్రియను సులభతరం చేసేందుకు లీడ్ బ్యాంక్ యూబీఐ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముంపు బాధితులు తమ పరిధిలోని బ్యాంకులు లేదా ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా సేవలు పొందొచ్చని తెలిపారు. (Story : బ్యాంకింగ్ సేవలకు ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్)