‘నా పాత్రకు మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ’
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: సోనీ లివ్‌లో సరికొత్త విడుదల ‘బెంచ్ లైఫ్’ ఒక ఉద్యోగి కార్పొరేట్ జీవితాన్ని సరికొత్తగా చూపించేందుకు వాగ్దానం చేస్తోంది. ఇది ఏ యాక్టివ్ ప్రాజెక్ట్ లేని ఉద్యోగి బెంచ్‌గా పిలవబడే ఐటి ప్రపంచంలో అంతగా తెలియని వాస్తవాల కథనాన్ని అందిస్తుంది. దీంట్లో బాలు, మీనాక్షి, ఇషా, రవి ప్రతి ఒక్కరి పాత్ర కూడా తమ క్యారెక్టర్ మార్పు చెందే విధానంతో కథాంశానికి ప్రత్యేకతను తీసుకువస్తుంది. అలాంటి మార్పు మీనాక్షిని కూడా అనుసరిస్తుంది. ఆమె దర్శకురాలు కావాలనుకుంది, కానీ కార్పొరేట్ లూప్‌లో చిక్కుకుంది. ప్రతిభావంతులైన నటి రితికా సింగ్ ఈ పాత్రను పోషించారు. ఇటీవల తన పాత్ర వెనుక ఉన్న అసలు ప్రేరణను ఆమె వెల్లడిరచారు. ‘‘బెంచ్ లైఫ్‌లో నా పాత్ర పరివర్తన మా దర్శకురాలు మానసా శర్మ నిజ జీవిత కథ. ఆమె నా ముందు ప్రత్యక్ష ఉదాహరణ. ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుండి తన స్వంత సిరీస్‌కి దర్శ కత్వం వహించడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. సామాజిక నిబంధనలు, అంచనాలను ధిక్కరించడానికి, నిజంగా వారు ఉండాలనుకుం టున్నట్లుగా ఉండటానికి ఎంతో ధైర్యం కావాలి. బెంచ్ లైఫ్‌లో ఆ పాత్రను పోషించినందుకు నేను చాలా సంతోషించాను’’ అని అన్నారు.(Story : ‘నా పాత్రకు మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ’)