మోటార్ వాహన తనిఖీ కార్యాలయం పై ఆకస్మిక తనిఖీ
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని మార్కెట్ యార్డులో గల నూతనంగా ప్రారంభించిన మోటార్ వాహన తనిఖీ అధికారి యూనిట్ కార్యాలయమును రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి కార్యాలయ పరిస్థితులు, ఇతరత్రా విషయాలపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఆర్టీవో అధికారులతో కార్యాలయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి సదుపాయాలు చూసి, రేకుల షెడ్డులో ఉన్న కార్యాలయమును చూసి మీరు ఎలా పని చేస్తున్నారని వారు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. అనుకూల పరిస్థితులను గూర్చి ఆలోచించి అనువైన ప్రాంతాన్ని త్వరలో ఎన్నుకుంటామని తెలిపారు. కార్యాలయంలో వసతులతో పాటు ఫర్నిచర్, కంప్యూటర్ లాంటి పరికరాలను కూడా త్వరగా పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతమున్న కార్యాలయం అనుకూలంగా లేదని తెలిపారు. ఏది ఏమైనా పని నిమిత్తం వచ్చే వారికి గౌరవంగా పనిచేసే శాఖకు మంచి పేరు తీసుకొని రావాలని తెలిపారు. తదుపరి ఆవరణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఆర్టీవో కరుణ సాగర్ రెడ్డి, ఎం.వి.ఐ లు వరప్రసాద్ రాణి తదితరులు పాల్గొన్నారు. (Story : మోటార్ వాహన తనిఖీ కార్యాలయం పై ఆకస్మిక తనిఖీ )