Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన రహదారులు నిర్మిస్తాం

మెరుగైన రహదారులు నిర్మిస్తాం

0

మెరుగైన రహదారులు నిర్మిస్తాం

ప్రజల సౌకర్యార్థం మరిన్ని ఆర్టిసి బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తాం

ప్రజా సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం..

రవాణా శాఖ యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన రహదారులు నిర్మిస్తామని రాష్ట్ర ప్రజల సౌకర్యం మరిన్ని ఆర్టీసీ బస్సులతో పాటు పట్రికల్ బస్సులు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని, ప్రజా సంక్షేమమే ఎన్ డి ఏ ప్రభుత్వము యొక్క ముఖ్య లక్ష్యము అని రవాణా శాఖ యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలో ఆరు నూతన బస్సులను వారు పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసే ప్రారంభించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని విలీనం చేశారే కానీ సమస్యలు పరిష్కరించకపోవడం వలన ఆర్టీసీ ఉద్యోగుల యొక్క భద్రత జీవన విధానం కుంటూ పడిందని వారు మండిపడ్డారు. అంతేకాకుండా వైయస్సార్ పార్టీ కార్యాలయాల కోసం ఆర్టీసీ స్థలాలను కూడా తాకట్టు పెట్టడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 90 రోజులకే ప్రతిరోజు రాష్ట్రంలో మూడు నూతన బస్సులను నడుపుతున్నామని, వచ్చే ఐదు సంవత్సరాలలో ఐదువేల నూతన బస్సులను తెప్పించేందుకు ముఖ్యమంత్రితో చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 1400 బస్సులకు గాను 600 బస్సులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. చిత్తశుద్ధిగా సంకల్ప దిశలో వెళుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రస్తుతం మార్పు కనిపిస్తోందని, ఇంకను మరింత అభివృద్ధి దశలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు ఉంటుందని తెలిపారు.ఇందుకుగాను వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు జిల్లా తరఫున తెలిపారు. ప్రతి గ్రామానికి నూతన రోడ్లు వేయటం మరమ్మత్తులతో కూడిన రోడ్లను తప్పకుండా వేయడం జరుగుతుందని తెలిపారు. గత వైయస్సార్ ప్రభుత్వంలో జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ, వైయస్సార్ ప్రభుత్వం భూమి సేకరించకపోవడం వల్ల నేడు రహదారులు నిర్మించలేకపోయామని తెలిపారు. అనంతరం నూతన బస్సులో వారు కొద్దిసేపు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ప్రజా రవాణా అధికారి మధుసూదన్, డిపో మేనేజర్లు సత్యనారాయణ , షేక్ ఇనాయతుల్లా, సూపర్వైజర్లు సికిందర్, శ్రీరాములు డిపో ఉద్యోగులు, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున డిఎస్పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. (Story : మెరుగైన రహదారులు నిర్మిస్తాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version