వరల్డ్ వైడ్ గా 100 Crore+ గ్రాస్ కలెక్ట్ చేసిన
‘సరిపోదా శనివారం’
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా: నేచురల్ స్టార్ నాని యూనిక్ యాక్షన్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సరిపోదా శనివారం, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి గ్రేట్ బాక్సాఫీస్ మైల్ స్టోన్ ని సాధించింది. ఈ చిత్రం అన్ని చోట్లా అద్భుతమైన రన్‌తో దూసుకెలుతూ మూడో వారంలో కూడా ఆదరగొడుతోంది.
నాని మరో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అలరించారు. వరుస హిట్‌లు అతని గ్రోయింగ్ పాపులారిటీని సూచిస్తున్నాయి. SJ సూర్య ఈక్వెల్ గా ఆకట్టుకున్నారు, ఈ రెండు పవర్‌హౌస్ ట్యాలెంట్స్ డైనమిక్ ఫేస్ అఫ్ విజువల్ ఫీస్ట్ ని అందించింది.
సరిపోదా శనివారం డొమస్టిక్, ఓవర్సీస్‌లో కన్సిస్టెంట్ గా కలెక్షన్లను రాబోడుతోంది. నార్త్ అమెరికాలో 2.48 మిలియన్ల గ్రాస్‌తో ఈ చిత్రం $2.5 మిలియన్ల మార్కుకు చేరువలో ఉంది. ఇది ఇప్పటికే నార్త్ అమెరికాలో నానికి బిగ్గెస్ట్ గ్రాసర్.
నాని మునుపటి బ్లాక్ బస్టర్ ‘దసరా’ తర్వాత 100 కోట్ల మైలురాయిని చేరుకున్న నాని రెండవ చిత్రం సరిపోదా శనివారం. ప్రస్తుతం మూవీ అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. (Story : వరల్డ్ వైడ్ గా 100 Crore+ గ్రాస్ కలెక్ట్ చేసిన ‘సరిపోదా శనివారం’)