ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు
శ్రీ కృష్ణ, అవధూత తిక్క నారాయణస్వామి ఆశ్రమ నిర్వాహకులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని సిద్దయ్యగుట్టలో శ్రీకృష్ణ, తిక్క నారాయణ స్వామి ఆశ్రమంలో సబ్ జైల్ సూపర్డెంట్ బ్రహ్మిరెడ్డి కుమార్తె బ్రాహ్మినీ రెడ్డి పుట్టినరోజును ఆశ్రమంలో దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని అనాధలకు అన్నదానమును తమ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం బ్రహ్మ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కుటుంబంలో జరిగే శుభకార్యములను ఇలాగా నిర్వహించుకుంటే మానవతా విలువలు పెరిగే అవకాశం ఉన్నాయని, చక్కటి సంతృప్తి ఆనందము కలుగుతుందని తెలిపారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు సబ్ జైలర్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు)