నూతన సీఐ బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపిన టిడిపి రజక సాధికార కమిటీ
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం పట్టణంలో నూతన సిఐ గా బాధ్యతలు చేపట్టిన వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ కు, టూ టౌన్ సీఐ రెడ్డప్పకు, రూరల్ గ్రామీణ ప్రాంత సిఐ ప్రభాకర్కు, ఎస్సై నరేంద్రకు మర్యాదపూర్వకంగా టిడిపి రజక సాధికార కమిటీ హిందూపురం పార్లమెంట్ కన్వీనర్ మాల్యవంతం నారాయణస్వామి ఆధ్వర్యంలో కలిసి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రజకులు మాట్లాడుతూ రజకుల సమస్యలు, రజకులపై దాడులు గూర్చి సిఐలకు తెలియజేశా రు. ఈ సందర్భంగా సిఐలు మాట్లాడుతూ రజకుల అభివృద్ధికి, భద్రతకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అవాంఛనీయ సంఘటనలు గాని అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరిగితే మా దృష్టికి తీసుకొని రావాలని వారు తెలిపారు. తదుపరి ముగ్గురు సీఐలను, ఎస్ఐలను రజకుల కమిటీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు, గంగమ్మ గుడి అధ్యక్షులు కృష్ణాపురం మస్తానప్ప, వెంకటేశులు, రామకృష్ణ, రామాంజి ,గంగరాజు, రాముడు, రాధాకృష్ణ, గణేషు, అక్కులప్ప, శ్రీనివాసులు, నాగరాజు, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు. (Story : నూతన సీఐ బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపిన టిడిపి రజక సాధికార కమిటీ)