వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
న్యూస్ తెలుగు ధర్మవరం ( శ్రీ సత్యసాయి జిల్లా) : నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ వినాయక చవితి పండుగను కుటుంబంలో వారందరూ కూడా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకొని సుఖశాంతులతో మెలగాలని వారు తెలిపారు. అదేవిధంగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వార్డ్ కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు, నాయకులకు కార్యకర్తలకు కూడా వినాయక పండుగ చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి)