రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
ఆదేశించిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆర్.డి.ఓలు, తహసిల్దార్, ఇతర అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ గురువారం ఆదేశించారు. అన్ని మండల కేంద్రాలలో, ఆర్.డి.ఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లు 24/7 పనిచేయాలని సూచించారు. అలాగే క్షేత్ర స్థాయి సిబ్బంది నిత్యం పర్యటిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంచెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండల నోడల్ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఏదైనా సంఘటన జరిగితే వెంటనే తనకు సమాచారం అందించాలని సూచించారు. (Story : రానున్న మూడు రోజులు భారీ వర్షాలు)