ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువైనది..
ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కన్నా ఎంతో విలువైనదని, విద్యార్థులను చక్కటి మార్గదర్శకముతో నడిపించేది కేవలం ఒకే ఒక ఉపాధ్యాయుడు అని ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో
ధర్మవరం మండల, మున్సిపల్ పరిధిలో పనిచేయుచున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భముగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ కార్యక్రమము ను నిర్వహించారు. తదుపరి
ఆర్డీవో చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు.
అవార్డ్ గహితలు లో,
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత బి. సంజీవయ్య, హెడ్మాస్టర్, మున్సిపల్ ఉన్నత పాఠశాల శాంతి నగర్. ధర్మవరం,మండల ఉత్తమ ఉపాధ్యాయులు
డి. నాగేంద్ర, రిటైర్డ్ టీచర్, మున్సిపల్ ఉన్నత పాఠశాల నెహ్రు నగర్,
గోపాల్, రిటైర్డ్ హెడ్మాస్టర్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రావులచేరువు,. పి. సుశీల , టీచర్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , ధర్మవరం,
దేవమని, టీచర్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తిప్పేపల్లి కలరు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ తో పాటు ఎంఈఓ లు గోపాల్ నాయక్ రాజేశ్వరి దేవి, ఎస్బిఐ రీజినల్ మేనేజర్, ధర్మారంలో పనిచేస్తున్న హెడ్మాస్టర్లు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువైనది.. )