ఉత్తమ ఉపాధ్యాయునిగా బి. సంజీవయ్య
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని శాంతినగర్ లో హెడ్మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న బి. సంజీవయ్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక అయిన తర్వాత జిల్లా అధికారుల ద్వారా అవార్డును పొందారు.. వీరి సేవలకు గాను ఈ అవార్డును జిల్లా ఉన్నతాధికారులు ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు పాఠశాల కమిటీ తల్లిదండ్రులు విద్యార్థులు హెడ్మాస్టర్ సంజీవయ్యకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి సంజీవయ్య మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తాను మరింత కృషి చేస్తానని, ఈ అవార్డు మా పాఠశాలకే అంకితం అని వారు తెలిపారు. (Story : ఉత్తమ ఉపాధ్యాయునిగా బి. సంజీవయ్య)