హైదరాబాద్‌కు పెరి-పెరి రుచిని తీసుకువస్తున్న నాండోస్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: తన ప్రత్యేకమైన ఫ్లేమ్-గ్రిల్డ్ పెరి-పెరి చికెన్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రియమైన దక్షిణాఫ్రికా రెస్టారెంట్ బ్రాండ్ నాండోస్ హైదరాబాద్‌లోని ఆర్‌ఎంజెడ్ నెక్సిటీలో ప్రారంభమవుతోంది. ఈ అందమైన న్యూ కాసా (పోర్చుగీస్‌లోని రెస్టారెంట్) నవాబుల నగరంలోకి నాండోస్ ప్రవేశించడాన్ని సూచిస్తుంది. ‘‘ఆహార వైవిధ్యం, మసాలాల పట్ల ప్రేమకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌కు మా ప్రపంచ ప్రఖ్యాత పెరి-పెరి రుచులను తీసుకురావడానికి మేం సంతోషిస్తున్నాం. భారత్ లో మా ఉనికిని పెంచుకుంటూ పోతున్నందున ఈ ప్రారంభం మాకు మైలురాయి’’ అని నాండోస్ ఇండియా సీఈఓ సమీర్ భాసిన్ అన్నారు.
ఆఫ్రికా కొన నుండి భారతదేశానికి, వైవిధ్యభరితమైన భూమికి ఈ సంస్థ ప్రయాణం ఒక సాహసం. ఇది 36 సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్గ్‌లోని ఒకే ప్రదేశంతో ప్రారంభమైంది – ఇప్పుడు 5 ఖండాలలోని 24 దేశాలలో విస్తరించి ఉంది. జోహాన్స్ బర్గ్ నుండి లండన్, షికాగో, సిడ్నీ, కౌలాలంపూర్, ఇప్పుడు హైదరాబాద్ వరకు, నాండోస్ ఎప్పుడూ వేడి వేడి పదార్థాలని తెస్తుంది. నాండోస్ కొత్త కాసా ఆర్‌ఎంజెడ్ నెక్సిటీ హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో ఒక ప్రధాన కార్పొరేట్ హబ్‌లో ప్రారంభించబడిరది. (Story : హైదరాబాద్‌కు పెరి-పెరి రుచిని తీసుకువస్తున్న నాండోస్ )