డిసెంబర్‌లో ఎస్‌ఐయు స్లాట్ 2025 పరీక్ష
న్యూదిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన సంస్థ సింబియాసిస్ ఇంటర్నేషన్ (డీమ్డ్ యూనివర్శిటీ)(ఎస్‌ఐయు). అలాంటి సింబియాసిస్ ఇంటర్నేషనల్.. సింబియాసిస్ లా అడ్మిషన్ టెస్ట్ (స్లాట్) 2025ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోంది. విశ్వవిద్యాలయంలో న్యాయవృత్తి కోర్సుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అప్లికేషన్ విండో అధికారికంగా ఆగస్ట్ 14, 2024న ఓపెన్ అయ్యింది. అప్లికేషన్ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాత డిసెంబరులో పరీక్షను అంటే డిసెంబర్ 13 (శుక్రవారం), డిసెంబర్ 15 (ఆదివారం) నిర్వహించబోతున్నారు. మామలుగా అయితే ఈ పరీక్షను మేలో నిర్వహిస్తారు. కానీ తొలిసారి టైమ్ లైన్‌లో మార్పులు చేసి డిసెంబరులో నిర్వహిస్తున్నారు. దీంతో ప్రవేశ పరీక్షకు హాజరు కావాలనుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ఇతర ముఖ్యమైన సమాచారంపై సమగ్ర వివరాల కోసం అధికారిక స్లాట్ వెబ్‌సైట్ స్లాట్`టెస్ట్.ఆర్గ్‌ని చూడగలరు. ఈ పరీక్ష రెండుసార్లు నిర్వహిస్తారు.(Story : డిసెంబర్‌లో ఎస్‌ఐయు స్లాట్ 2025 పరీక్ష)