ఏకగ్రీవంగా ఎన్ని కైన వైధ్య నారాయణ ధన్వంతరి ఉత్సవ కమిటీ
న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా స్థానిక ధర్మవరం పట్టణం లక్ష్మి చెన్నకేశవపురం నందు నాయిబ్రాహ్మణ సోదరులు సమావేశమై ప్రతి సంవత్సరం ధన్వంతరి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో శ్రీ వైధ్య నారాయణ ధన్వంతరి ఉత్సవ కమిటీ గౌరవాధ్యక్షులుగా పసులూరి శివ శంకర, కడియాల తిరుపతయ్య, అధ్యక్షులు కొడవండ్లపల్లి జనార్దన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోనాపురం సాయిప్రసాద్ ను, గౌరవ సలహాదారులుగా దామోదర్, మాల్యావంతం చలపతి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని నా ఈ బ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు.ఇందుకుగాను నాయిబ్రాహ్మణ సోదరులు హర్షం తెలియజేస్తూ… అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తాడిమర్రి రాము, గొడ్డుమర్రి ఆనంద్, దేవరపల్లి శివయ్య, కొడవండ్లపల్లి శ్రీనివాసులు, కడియాల మహేష్, రెడ్డిపల్లి వెంకటరమణ, పెద్దకోట్ల బాల యోగా నంద పాల్గొన్నారు. (story : ఏకగ్రీవంగా ఎన్ని కైన వైధ్య నారాయణ ధన్వంతరి ఉత్సవ కమిటీ)