తోలుబొమ్మల కళాకారిణికి మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు
‘శిల్ప గురు ‘ అవార్డు గ్రహీత కు సన్మానం చేసిన మంత్రిగా సిబ్బంది
న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : మండల పరిధిలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మకు ‘శిల్ప గురు’ జాతీయ అవార్డు దక్కడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి ఆదేశాలతో కార్యాల సిబ్బంది నిమ్మలకుంట గ్రామంలోని ఆమె ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్బంగా, మంత్రి తరపున హరీష్, మల్లికార్జున షీల్డ్ను అందజేసి, జాతీయ అవార్డు రావడం సంతోషకరమని ఈ అవార్డు అందడం తోలుబొమ్మల కళాకారులకు,ముఖ్యంగా రాయలసీమ కళాకారులకు గర్వకారణమని తెలిపారు. ఇలాంటి కళలను కాపాడుకునేందుకు ఆమె చేస్తున్న సేవలను అభినందిస్తూ శివమ్మ లాంటి వారి స్ఫూర్తితో యువత ప్రాచీన కళలను కాపాడుకునే చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి.చెర్లోపల్లి నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు. (Story: తోలుబొమ్మల కళాకారిణికి మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు)