చలసాని ఆంజనేయులు సేవలు చారిత్రాత్మకం….!
కృష్ణ మిల్క్ యూనియన్ డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు
న్యూస్ తెలుగు చాట్రాయి :కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సేవలు చారిత్రాత్మకమైనవని డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు కొనియాడారు.బుధవారం చాట్రాయి మండలం చీపురుగూడెం పాలకేంద్ర వద్ద ఆయన పాడి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.భారి వర్షాల నేపథ్యంలో కూడా కృష్ణ మిల్క్ యూనియన్ కు పాలు పోస్తున్న రైతులకు గాని వినియోగదారులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలు అందించిన ఘనత కృష్ణా మిల్క్ యూనియన్ కి దక్కిందన్నారు.దానికి ప్రధానమైన కారణం చైర్మన్ చలసాని ఆంజనేయులు గారి ముందు చూపే అన్నారు. భారీ వర్షాలు వరదల వలన విజయవాడ పాల నిల్వ కేంద్రంలో 70 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ వీరవల్లిలో కట్టిన కర్మాగారాన్ని ఉపయోగించడం వలన కష్టకాలంలో కూడా ప్రజల ముంగిటకు సేవలు అందించిన ఘనత దక్కింది అన్నారు. చలసాని ఆంజనేయులు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలు చేపట్టిన పనులు వలన సంక్షోభ సమయంలో కూడా కృష్ణ మిల్క్ యూనియన్ సరైన సేవలు అందించగలిగిందన్నారు. ఆయన సేవలు చరిత్రలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. (Story : చలసాని ఆంజనేయులు సేవలు చారిత్రాత్మకం….!)