మానవాళికి మార్గం చూపిన మహనీయుడు ప్రవక్త మహమ్మద్
న్యూస్‌తెలుగు / వినుకొండ : మీలాదున్ నబి మహోత్సవాల సందర్భంగా నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక న్యాయవాది సిద్దయ్య కార్యాలయంలో నూర్ భాషా సంఘీయుల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ప్రముఖ న్యాయవాది షేక్ సిద్దయ్య పాల్గొని ప్రసంగిస్తూ దేవుని అంతిమ ప్రవక్త మహమ్మద్ సర్వ మానవాళికి శాంతిని, ప్రేమను, కరుణను, బోధించారని అన్నారు. ఏ వ్యక్తి మరో వ్యక్తిని అన్యాయంగా హత్య చేస్తే అతను సమస్త మానవాళిని హత్య చేసినట్లేనని బోధించి తన మార్గం శాంతి మార్గం అని బోధించి ఆచరించి చూపిన గొప్ప దయామయుడు ప్రవక్త మహమ్మద్ అని సిద్దయ్య తెలిపారు.
మక్కా నుండి మొదలైన ప్రవక్త బోధనలు కడు విశ్వ వ్యాపితమై ప్రపంచమంతా విస్తరిల్లాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘ కార్యదర్శి ఎస్కే. మస్తాన్, ట్రెజరర్ ఈశ్వరయ్య, మరియు షేక్ సాయి బాబా, షేక్. హుస్సేన్, షేక్. మీరయ్య, షేక్ నాసర్, షేక్ ఫరీద్, షేక్ మస్తాన్ వలి, షేక్, సలీం తదితరులు పాల్గొన్నారు. (Story : మానవాళికి మార్గం చూపిన మహనీయుడు ప్రవక్త మహమ్మద్)