అభివృద్ధి మరచి దాడులు చేస్తున్నారు
మాజీ ఎమ్మెల్యే బొల్లా
న్యూస్‌తెలుగు / వినుకొండ : మమ్మల్ని గెలిపించండి మంచి పాలన అందిస్తాం అని ప్రజలకు హామీలిచ్చి గద్దినెక్కిన టిడిపి ప్రభుత్వం పాలన మరిచి వైసిపి వారిపై కక్ష సాధింపు చర్యలు, దాడులు, సానుభూతిపరులపై వేధింపులే ధ్యేయంగా పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సభలు వినకొండ లో ఘనంగా నిర్వహించారు. వైసీపీ కార్యాలయంలో ముళ్ళమూరు బస్టాండ్ సెంటర్లోని వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఆయాసభలకు న్యాయవాది సికే రెడ్డి అధ్యక్షత వహించగా, బొల్లా మాట్లాడుతూ. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలు మెచ్చుకునే విధంగా పాలన చేశారని, ప్రజా సంక్షేమంపై ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఫీజు రీయంబర్స్మెంట్, 108 సర్వీసులు వంటి సంక్షేమ పథకాలు ప్రజల మదిలో నిలిచిపోగా, ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ద్వారా వారంతో ఆర్థిక అభివృద్ధి సాధించి ఇంజనీర్లు, డాక్టర్లు ఆర్థికంగా బలపడుతున్నారని ఆయన అన్నారు. అదే సంక్షేమ పథకాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనసాగించారన్నారు. టిడిపి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు పలు వాగ్దానాలు చేసి. నేడు వైసిపి వారిపై దాడులే ప్రధానంగా పెట్టుకుందన్నారు. వినుకొండ మండలంలోని పిట్టంబండ గ్రామంలో బాలాజీసింగ్ ఇంటి పై మూడుమార్లు టిడిపి వారు దాడులు చేసి, తమ పీఏ పై కూడా దాడి చేశారన్నారు. వినుకొండ నియోజకవర్గం లో బలహీన వర్గాలపై దాడులు అధికమయ్యాయని అలాగే వ్యాపారస్తులను బెదిరించడం ప్రారంభమైందని, ఎమ్మెల్యే అంటే అభివృద్ధి ప్రజా సేవ చేయాలని, వ్యక్తిగతం కోసం కాదని బొల్లా అన్నారు. తాను అక్రమంగా ఆస్తులు సంపాదించానని ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించిన కూటమి నాయకులు నేడు నోరు మెదపడం లేదని, తాను అక్రమంగా సంపాదించిన ఒక్క సెంటు భూమి ఉన్న స్వాధీనం చేసుకోవచ్చని టిడిపి ప్రభుత్వానికి బొల్లా సూచించారు. వినుకొండలో ప్రజలకు మంచి పాలనే లేకుండా పోయిందని, పదవులు శాశ్వతం కాదు మంచి పనులు చేయండి. ప్రతిపక్షం కూడా సహకరిస్తుంది అని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హితవు పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు ప్రాంతాలలో పులిహార పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బత్తుల చిన్నబ్బాయి, సీనియర్ న్యాయవాది ఎం ఎన్ ప్రసాద్, నూజెండ్ల ఎంపీపీ జయరామిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గంధం బాల్రెడ్డి, బొల్లాపల్లి జెడ్పిటిసి ఆర్. కృష్ణ నాయక్, వినుకొండ జడ్పిటిసి రాజా, ఎంపీపీ. పి. వెంకటరామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు. (Story : అభివృద్ధి మరచి దాడులు చేస్తున్నారు)