వైఎస్ఆర్‌కు ఘన నివాళి
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని పీఆర్టీ సర్కిల్, కొత్తపేట, సాయి నగర్, ఎల్సికేపురం, సాయిబాబా గుడి ఆర్చ్ ల వద్ద వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ 15వ వర్ధంతి వేడుకలను వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, సుస్థిర పాలన అందించిన మహానేత డాక్టర్ వైయస్సార్ అని కొనియాడారు. అంతేకాకుండా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. అంతేకాకుండా నేడు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో 108,104, ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నారంటే అది వైయస్సార్ చలవేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, బాల్రెడ్డి, మాసపల్లి సాయికుమార్, మేడాపురం వెంకటేష్, పురుషోత్తం రెడ్డి, కేతా లోకేష్, గజ్జల శివ, కడప రంగస్వామి, సర్పంచు రంగారెడ్డి, వార్డ్ ఇన్చార్జులు బడనపల్లి కేశవరెడ్డి, బాలన్ గోపాల్, చెలిమి పెద్దన్న, కేశగాల కృష్ణ, జింక కంబగిరి, అజంతా కృష్ణ ,దేవరకొండ రమేష్, బడన్నపల్లి నరసింహులు, గూండా ఈశ్వరయ్య, కోళ్లమరం కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Story : వైఎస్ఆర్‌కు ఘన నివాళి)