కమిషనర్ మల్లికార్జున నియామకం వద్దు అంటూ
టిడిపి నాయకులు నిరసన
టిడిపి నాయకులు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రస్తుతం ధర్మవరం మున్సిపాలిటీకి కమిషనర్ గా నియమించబడిన మల్లికార్జున వద్దు అంటూ టిడిపి నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు పురుషోత్తం గౌడ్, భీమనేని ప్రసాద్ నాయుడు, అంబటి సనత్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో కమిషనర్ టిడిపి నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం దారుణం అని తెలిపారు. విద్యరుడు స్థలాలు రోడ్డు పక్కన ఉంటే ఎంతో విలువైన స్థలాల భూములే కాకుండా తుంపర్తి దగ్గర టిడిపి హయాంలో ఇచ్చిన 6000 పట్టాలను తొలగించి వైసిపి నాయకులకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆరోపించారు. కమిషనర్ తిరిగి వెనుతిరగాలని అంతవరకు మా పోరాటాలు ఆపమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంపురం శీన, గంగారపు రవి, అడ్ర రమేష్, యుగంధర్, లోకేష్, కుళ్లాయప్ప, సంఘాల బాలు, రామకృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు.