కరెంట్ షాక్, గుండెపోటుతో ఇద్దరు మృతి
న్యూస్‌తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణములో పలుచోట్ల ఇద్దరు మృత్యువాత పడ్డారు. వివరాలకు వెళితే పట్టణంలోని చంద్రబాబు నగర్ లోని రంగస్వామి (22) అనే వ్యక్తి కూలి మగ్గం వేస్తూ జీవనం కొనసాగించేవారు. అయితే తన ఇంట్లో నీటిని వేడి చేయాలని హీటర్ చేతికి తీసుకొని ఏదో ఆలోచిస్తూ బోర్డులో స్విచ్ ఆన్ చేయడంతో విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి మృతుని తల్లి జయలక్ష్మి ప్రియాది మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని, సవ పరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశా రు. ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు బంధుమిత్రులు తెలుపుతున్నారు.
గుండెపోటుతో చేనేత కార్మికురాలు మృతి : పట్టణంలోని శివానగర్ నాలుగవ వార్డులో రజియాబి (43) చేనేత మగ్గం వేస్తూ అద్దె ఇంటిలో జీవనం కొనసాగించేది. కాగా ఉదయం 11 గంటల సమయంలో చాతి నొప్పి రావడంతో, ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. గమనించిన భర్త వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించిన తర్వాత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలుకు భర్తతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు, బంధుమిత్రులు కోరారు. (Story : కరెంట్ షాక్, గుండెపోటుతో ఇద్దరు మృతి)