గ్రాండ్ షాప్‌సీ మేళా పండుగ సంబరాలు ప్రారంభం
న్యూస్‌తెలుగు/బెంగళూర: భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత విలువైన ప్లాట్ ఫారమ్ ఫ్లిప్ కార్ట్ షాపింగ్ వాతావరణాన్ని గ్రాండ్ షాప్‌సీ మేళాగా ప్రారంభిస్తూ పండుగ సంబరాలకు సన్నద్ధమవుతోంది. సెప్టెంబర్ 1 నుండి 8 వరకు నడిచే ఈ అమ్మకం, సాంప్రదాయ భారతీయ వేడుకల సారాన్ని సంగ్రహించి, అసమానమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తూ, షాప్‌సీ ప్లాట్‌ఫారాన్ని శక్తివంతమైన వర్చువల్ మేళాగా మారుస్తుంది. నాణ్యత, వైవిధ్యాలపై దృష్టి సారించిన గ్రాండ్ షాప్‌సీ మేళా ఈ సంవత్సరంలో అతిపెద్ద షాపింగ్ వేడుకలలో ఒకటిగా అవతరిస్తుందని, వినియోగదారులకు పండుగ సీజన్ కోసం అవసరమైన ప్రతీ వస్తువును సరసమైన ధరలకు అందించే వీలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి అందిస్తూ రూ. 199/- లోపు 50 లక్షల ఉత్పత్తుల విస్తృతమైన ఎంపిక ఉంటుంది. ఈ సంవత్సరం, షాప్‌సీ ఫ్యాషన్, బ్యూటీ, హోమ్, మొబైల్స్, లార్జ్ ఎలక్ట్రానిక్స్ లలో 150 కేటగిరీలకు తన ఆఫర్లను విస్తరిస్తోంది, ఇది గత సంవత్సరపు 60 కంటే రెట్టింపు అధికం. సరికొత్త, పండుగ ఎంపికలు, అద్భుతమైన డీల్ లతో కూడిన ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తోందని షాప్‌సీ బిజినెస్ హెడ్ ప్రత్యూషా అగర్వాల్ తెలిపారు. (Story : గ్రాండ్ షాప్‌సీ మేళా పండుగ సంబరాలు ప్రారంభం)