ఎన్టీఆర్ వైద్య సేవ రోగుల వార్డుల తనిఖీ
న్యూస్‌తెలుగు/వినుకొండ: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించడం జరిగినది ఎన్టీఆర్ వైద్య సేవ రోగుల వార్డులు తనిఖీ చేయడం మరియు రికార్డులను పరిశీలించడం జరిగింది రోగులను సందర్శించి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నందు జనరల్ మెడిసిన్ మరియు గైనకాలజీ వార్డులోని రోగులను వారికి అందుచున్న సేవలను అడిగి తెలుసుకొనడం జరిగినది ఉచితంగా భోజనం మందులు శాస్త్ర చికిత్సలు జరుగుచున్నవి అని రోగులు అన్ని ఉచితంగా ఇస్తున్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా అన్ని ఉచితంగా హాస్పిటల్స్ సిబ్బంది వైద్య మిత్ర అందిస్తున్నారని జిల్లా కోఆర్డినేటర్ కు రోగులు సమాధానం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నందు జిల్లావ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ హాస్పిటల్ మరియు ప్రభుత్వ వైద్యశాల నందు ఉచితంగా టెస్టులు మందులు భోజనం ఇవ్వటం జరుగుతుంది ఎక్కువగా సీజనల్ వ్యాధులు సంభవిస్తున్న సందర్భముగా హాస్పిటల్స్ సందర్శించడం జరిగినదని ఈ సీజన్లో వచ్చే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులకు ఉచితంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నందు చూస్తారని రోగులు ఎటువంటి భయం లేకుండా హాస్పటల్ కి వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా టెస్టులు మందులు భోజనం తీసుకుని మీకు వచ్చిన రోగము ను నయం చేసుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వినియోగించుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ రజాక్ వైద్య మిత్ర మాచర్ల బుజ్జి టీమ్ లీడర్ ప్రశాంతి రత్నం డీఈఓ సాగర్ హాస్పటల్ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు. (Story : ఎన్టీఆర్ వైద్య సేవ రోగుల వార్డుల తనిఖీ)