వరి విత్తనాల మోసం
న్యూస్‌తెలుగు/వినుకొండ : శావల్యాపురం చెందిన ముట్లూరి బాలస్వామి అనే వరి రైతు ఈ నెల 16న వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్ లో ఉన్న విజయలక్ష్మి సీడ్స్ ఏజెన్సీ వద్ద జేవిఎల్ కంపెనీకి చెందిన 384 రకం వరి విత్తనాలను 30 కేజీలు కొనుగోలు చేసి తన ఎకరం పొలంలో ఈ నెల 22న పొలంలో చల్లడం జరిగింది. అయితే ఎటువంటి మొలక ఎత్తలేదు, తనతో పాటు గ్రామానికి చెందిన మరి కొంతమంది రైతులు శ్యాంసోన్ రెండు ఎకరాలు, నాని రెండు ఎకరాలు, బిక్షాలు రైతు రెండెకరాలు వరి విత్తనాలు మొలక రాలేదు. ఈ విషయం సంబంధిత విజయలక్ష్మి సీడ్స్ ఏజెన్సీ వారికి తెలియజేయడం జరిగింది. కానీ వారి వద్ద నుంచి ఎలాంటి స్పందన లేదు, మా పొలం కు వచ్చి పరిశీలిస్తామని చెప్పి నన్ను షాపు చుట్టూ తిప్పుకుంటున్నారు. కావున తమకు సంబంధిత వ్యవసాయ అధికారులు, షాపు యజమానులు పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగాఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు చల్లి మొక్కల రానందువల్ల నేను తీవ్రంగా నష్టపోయాను. అవి నకిలీ విత్తనాలుగా భావిస్తున్నాను అని, వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు వెంటనే స్పందించి తమ పొలం పరిశీలించవలసిందిగా ముట్లూరి బాలస్వామి ఒక ప్రకటనలో ఆరోపించారు. (Story : వరి విత్తనాల మోసం)