నవనీత కృష్ణుడిగా శ్రీవారి దర్శనం
న్యూస్‌తెలుగు /వినుకొండ : ఓం నమో వెంకటేశాయ ఈరోజు వినుకొండలో వేంచేసి ఉన్న అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా నవనీత కృష్ణుడిగా శ్రీవారి దర్శనం వచ్చే భక్తులు స్వామి వారికి ఇచ్చిన . 25 కేజీల వెన్నతో ప్రత్యేక అలంకరణలు. జరిగినవి. మరలా విశేషాలంకరణ సాయంత్రం ఏడు గంటలకు భారీగా పాల్గొన్న మహిళా భక్తుల ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే మహోత్సవము చాలా ఘనంగా జరిగాయి. విశేషంగా భక్తులు శ్రీవారిని దర్శించి తరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రెడ్డి బంగారయ్య కోటేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు మరియు ఆలయ అర్చకులు శ్రీనివాసుల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ స్వామి కలియుగ దైవం కోరిన కోరికలు తీర్చే భగవంతుడని ఈ సందర్భంగా కొనియాడారు పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. (Story : నవనీత కృష్ణుడిగా శ్రీవారి దర్శనం)