AITUC జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలి
న్యూస్‌తెలుగు /వినుకొండ : సెప్టెంబర్ 1,2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరుగునున్న AITUC జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలని ఈరోజు వినుకొండ శివయ్య భవన్ AITUC ఆఫీస్ లో AITUC ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సంపెంగుల అబ్రహం రాజు అధ్యక్ష వహించారు. ఈ సందర్భంగా AITUC ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ:-” కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులను కాలరాయటమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రభుత్వ రంగ సమస్యలన్నిటిని ప్రైవేటుపరం చేస్తుండటంతో లక్షల మంది కార్మికులు,ఉద్యోగులు వీధులు పాలవుతున్నారని బూదాల విమర్శించారు. 44వ కార్మిక హక్కులను నాలుగు కార్మిక కోడ్లుగా కుదించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సమ్మె హక్కు లేకుండా చేయటం దుర్మార్గమని అన్నారు. స్కీం వర్కర్లు, ఆషా,అంగనవాడి, మధ్యాహ్న భోజనం, స్వచ్ఛభారత్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అనేకసార్లు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాలలో ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేదని బూదాల మండిపడ్డారు. AITUC జాతీయ సమ్మేళనాలతో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు బూదాల తెలియజేశారు .”ఈ కార్యక్రమంలో రాచపూడి ఏసు పాదం, పచ్చిగొర్ల ఏసు, సుబేదార్, యూనుస్, కొప్పరపు మల్లికార్జున, కత్తి నవీన్, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, సోమవరపు దావీదు, AITUC అనుబంధ ప్రజా సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story : AITUC జాతీయ సమ్మేళనాలను జయప్రదం చేయాలి)