ఆర్ ఓ ఆర్ ముసాయిదా చట్టం పై అవగాహన
జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్
న్యూస్ తెలుగు /ములుగు : తెలంగాణా ప్రభుత్వం నూతన తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు, 2024, చట్టం చేయుటకుగాను, ముసాయిదా ఆర్.ఓ. ఆర్. చట్టం( డ్రాఫ్ట్ ఆర్ ఓ ఆర్ చట్టం )పై సలహాలు మరియు సూచనలు ఇచ్చుటకుగాను, జిల్లా స్థాయిలో, రైతు సంఘం నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, పాత్రికేయులు మరియు రెవెన్యూ అధికారుల (పదవిలో ఉన్నవారు మరియు పదవి విరమణ చేసినవారు) తో శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టరు దివాకర టి ఎస్ ఆద్వర్యములో సమావేశము ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఒక తెలిపారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందులో సలహాలు మరియు సూచనలు ఇచ్చుటకుగాను, రైతు సంఘం నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, పాత్రికేయులు మరియు రెవెన్యూ అధికారులకు నూతన తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు, 2024 లో పొందుపరిచిన అంశాలను వివరించడం జరిగినదన్నారు.బిల్లులోని అంశాలపై, పైన తెలిపిన వారు సలహాలు మరియు సూచనలు ఇవ్వడం జరిగినదని పేర్కొన్నారు.అట్టి సలహాలు మరియు సూచనలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్ర, ఆర్డీఓ, తదితరులు పాల్గొన్నారు. (Story : ఆర్ ఓ ఆర్ ముసాయిదా చట్టం పై అవగాహన)