స్లాబ్ తో ఉన్న అంగన్వాడీ భవనాలన్నీ అక్టోబర్ 2 కు పూర్తి కావాలి
బాల్య వివాహాల పై అవగాహన పెంచాలి
ప్రతి తల్లి పేరుతో మొక్క నాటాలి
ఐ.సి.డి.ఎస్. వంద రోజుల ప్రణాళిక సమీక్ష లో కలెక్టర్ ఆదేశాలు
న్యూస్‌తెలుగు/విజయనగరం : ప్రస్తుతం నిర్మాణం లో ఉండి స్లాబ్ లెవెల్ కు వచ్చిన అంగన్వాడీ భవనాలు పూర్తి చేసి అక్టోబర్ 2 వ తేదీ నాటికి అప్పగించాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. జిల్లాలో 259 అంగన్వాడీ భవనాలు ఉపాధి హామీ నిధులతో , 79 భవనాలు నాడు నేడు క్రింద మొత్తం 285 నిర్మాణం లో ఉన్నాయని, పంచాయతి రాజ్ ఈ ఈ కలెక్టర్ కు తెలుపగా అందులో స్లాబ్ లెవెల్ లో ఉన్న 40 భవనాలను వంద రోజుల ప్రణాళిక క్రింద పూర్తి చేసి అక్టోబర్ 2 నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మిగిలిన భవనాలను ఎప్పటికి పూర్తి చేస్తారో ఏక్షన్ ప్లాన్ ఇవ్వాలని అన్నారు. అన్ని ప్రభుత్వ అంగన్వాడీ భవనాల్లో తాగు నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఈ. కు సూచించారు.
శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో ఐ.సి.డి.ఎస్. 100 రోజుల ప్రణాళిక పై సంబంధిత శాఖల అధికారులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో అక్టోబర్ లోపల ప్రతి బాల బాలిక ఏదో ఒక పాథశాలలోనే ఉండాలని, బడి బయట ఏ ఒక్కరూ ఉండకూడదని తెలిపారు. నెలలో ఒక్కసారి పాఠశాలల్లో , కళాశాలల్లో రక్త హీనత పై అవగాహన కలిగించాలని తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వం, ప్రైవేటు భవనాల వద్ద ప్రతి తల్లి పేరుతో మొక్కలు నాటాలని , అవసరమగు మొక్కలు సామజిక అటవీ శాఖ నుండి తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం వంద రోజుల ప్రణాళిక తయారు చేసుకొని ఆ ఆమేరకు మొక్కలు నాటాలని తెలిపారు.
జిల్లాలో ఏ ఒక్క చోట బాల్య వివాహాలు జరగకుండా చూడాలని తెలిపారు. చట్టం లోని అంశాల పై లీగల్ సెల్ ద్వారా మండల స్థాయి లో అవగాహన కలిగించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మంది పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని, బరువు తక్కువ సంఖ్య తగ్గాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద న్యూట్రి గార్డెన్లను పెంచడానికి అవకాశం ఉన్న చోట్లను గుర్తించి జాబితాలను ఇవ్వాలని, ఉద్యాన వన శాఖ ద్వారా న్యూట్రి గార్డెన్ల ను పెంచడానికి శిక్షణలు ఇవడం జరుగుతుందని తెలిపారు.
ఈసమావేశంలో ఇంజనీరింగ్, వైద్య, విద్యా, ఉద్యాన, అటవీ శాఖల అధికారులు, ఐసిడీస్ పి.ఓ లు, విద్యుత్ శాఖల అధికారులు,సూపెర్వైజర్లు పాల్గొన్నారు.