నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
అన్నదాతల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
నీటిపారుదుల శాఖ అధికారుల ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని అన్నదాతలు ఏదైనా సమస్య తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఎమ్మెల్యే ఆ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రస్తుతం చేపట్టే, గతంలో చేపట్టిన కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన అన్నదాతలకు వెంటనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కర్నె తాండ లిఫ్ట్ కు సంబంధించి విద్యుత్ ఉపకేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గణపురం మండలం మామిడిమడ గ్రామ నేరేడు చెరువు పనులను వేగవంతం చేయాలన్నారు. మామిడి మాడ గ్రామానికి చూడాలన్నారు. కెనాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్లు కాలువలు పై బ్రిడ్జి నిర్మాణాల ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాటు చేయలన్నారు .D8, D2, MJ3, ఖాన్ చెరువు పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రేవల్లి మండలం తలుపునూరు తాండ 6A రెగ్యులేటర్ దగ్గర మరో రెగ్యులేటర్ నిర్మించి నీటిని విడుదల చేయాలని ఆయన సూచించారు. p j p పంటకాలను ప్రధాన కాలువలను ఎప్పటికప్పుడు పరిష్క పరచాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు
కార్యక్రమంలో ee మధుసూదన్ de లు, ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి)