స్టార్ ఆసుపత్రి క్లినిక్ ను తనిఖీ చేసిన వైద్య బృందం
న్యూస్ తెలుగు /ములుగు : రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆదేశాలు మేరకు, రాష్ట్ర జాయింట్ డైరెక్టర్, టీబి నియంత్రణ ఎయిడ్స్ మరియు లెప్రసీ విభాగం అధికారి డాక్టర్ ఏ .రాజేశం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య మరియు జిల్లా డిప్యూటీ డి యం హెచ్ ఓ డాక్టర్ విపిన్ బృందం శనివారం ములుగు లో ,స్టార్ హాస్పిటల్ ను క్లినికల్ ఎస్టాబ్లిమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ లో భాగంగా తనిఖీ చేయడం జరిగిందని జిల్లా వైద్య అధికారి అల్లెం అప్పయ్య తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ తనిఖీలొ హాస్పిటల్ నందు సిటిజన్ చా ర్ట్టర్, ధరల పట్టిక ,బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు లేనట్లు నిర్ధారించడం జరిగిందని,పై విధమైన సర్టిఫికెట్లు లేనందున,హాస్పిటల్ కు నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య కు ఆదేశించారు. ఈ తనకి లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దుర్గారావు, పూర్ణ సంపత్ రావు, సంపత్,ఇతర సిబ్బంది పాల్గొన్నారు. (Story : స్టార్ ఆసుపత్రి క్లినిక్ ను తనిఖీ చేసిన వైద్య బృందం.)