ఈ నెల 28 జాతీయ లోక్ ఆదాలత్
టి.కన్నయ్య లాల్
న్యూస్ తెలుగు /ములుగు : ములుగు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, ఈ నెల 28.న నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి. కన్నయ్య లాల్ పేర్కొన్నారు. శనివారం పోలీస్ అధికారుల తో సమావేశం ఏర్పాటు చేసి, సీనియర్ సివిల్ జడ్జి పోలీస్లను ఉద్దేశించి మాట్లాడుతూ జాతీయ , మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల సూచనల మేరకు తేదీ 28.09.2024 రోజున ములుగు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక కేసుల పరిష్కారానికి ములుగు పోలీస్ అధికారులు, సహకరించాలని తెలిపారు. రాజీ పడదగు కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రాజీమార్గం ద్వారా వారి కేసును పరిష్కరించుకునేలా అందరూ సహాయపడాలని తెలియజేశారు. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి న్యాయ సలహా సూచనల కొరకు అయిననూ న్యాయ సేవా అధికార సంస్థలను ఆశ్రయించి, న్యాయ సలహాలు, సూచనలను పొందగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జే. సౌఖ్య , పస్రా సి ఐ జి. రవీందర్ , శ ఏటూరునాగారం,సి ఐ అనుముల శ్రీనివాస్,, ఏటూరునాగారం ఎస్ ఐ తాజు ద్దీన్,ఎస్ కె. తాజు వెంకటాపురం, (నూగుర్ )సి ఐ బండారి కుమార్, వెంకటాపూర్,ఎస్ ఐ జే. సతీష్ పస్రా ఎస్ ఐ. ఏ.కమలాకర్, తాడ్వాయి ఎస్ ఐ ఎన్. శ్రీకాంత్ రెడ్డి, ఎస్. ఐ.తాడ్వాయి, షైక్ మస్తాన్ డి. సి. ఆర్. బి,షైక్ మస్తాన్, ములుగు ఎస్ ఐ సి.హెచ్ వెంకటేశ్వర్ రావు, మంగపేట ఎస్ ఐ , టి. వి. ఆర్. సూరి పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఈ నెల 28 జాతీయ లోక్ ఆదాలత్)