UA-35385725-1 UA-35385725-1

బుగత సూరిబాబు పోరాట స్పూర్తితో  కార్మిక పోరాటాలు కొనసాగిస్తాం

బుగత సూరిబాబు పోరాట స్పూర్తితో  కార్మిక పోరాటాలు కొనసాగిస్తాం

అమరజీవి కామ్రేడ్ బుగత సూరిబాబు 4 వ వర్ధంతి సభలో వక్తలు

న్యూస్‌తెలుగు/విజయనగరం :
ఎర్రజెండా ముద్దుబిడ్డ ఎర్రసుర్యుడు అమరాజీవి కామ్రేడ్ బుగత సూరిబాబు 4 వ వర్ధంతి కార్యక్రమాలు గురువారం డి.ఎన్.ఆర్ అమర్ భవన్, పి. డబ్ల్యూ మార్కెట్ లలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా అమరజీవి కామ్రేడ్ బుగత సూరిబాబు చిత్రపటానికి నాయకులు, కార్మికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు మాట్లాడుతూ 48 సంవత్సరములు పాటు కార్మికుల కష్టనష్టాల్లో అండగా నిలబడి ఎన్నో సమరశీల పోరాటాలు చేసి హక్కులు సాధించారు, అన్ని వర్గాల కార్మికుల శ్రమకి తగిన వేతనాల పెంపుదల కోసం కూలీ రేట్లు కోసం యాజమాన్యాలని ధీరోదాత్తంగా ఎదురొడ్డి పోరాడి సాధించిన కార్మికోద్యమ పోరాటయోధుడు అమరజీవి కామ్రేడ్ బుగత సూరిబాబు అని కొనియాడారు. కార్మిక హక్కుల కోసం చేసిన పోరాటాల్లో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన విప్లవకారుడు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శిగా పి.డబ్ల్యు మార్కెట్ లో లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న కార్మికుల సమస్యల పై, ఒంటెద్దు బళ్ళు కార్మికుల సమస్యల పై, కాల్ గ్యాస్ డెలివరీ బాయ్ ల కార్మికుల సమస్యల పై పట్టణంలో ఒకే రోజు ఒకే సమయంలో 6 చోట్ల యడ్ల బళ్ళతో రాస్తారోకో చేసిన పోరాటంలో పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిని జైలు జీవితాన్ని అనుభవించారన్నారు. యాజమాన్యం, పోలీసులు ఏకమై అప్పట్లో ఎన్ని కేసులు పెట్టిన భయపడని ఎర్ర సూర్యుడు అని కొనియాడారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా, విజయనగరం నియోజకవర్గ కార్యదర్శిగా విజయనగరం పట్టణంలో బుచ్చెన్న కోనేరు (మార్క్స్ నగర్), శాంతినగర్, పూల్ భాగ్ కోలని, డబుల్ కోలని, సి.ఆర్ నగర్ కోలనీ, పాల్ నగర్ లలో వందల ఎకరాల ప్రభుత్వ ఖాళీ స్థలాలను సిపిఐ నేతృత్వంలో ఆక్రమించి వందల మంది పేదలకు ఇళ్ళ స్థలాలను పోరాటాలు చేసి ఇప్పించిన పేదల నాయకుడు బుగత సూరిబాబు అని తెలిపారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం అమర్ భవన్ నిర్మాణం కోసం రాత్రింబవళ్ళు శ్రమించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గా గ్రామాల్లో తిరిగి విప్లవ గీతాలు పాడుతూ ప్రజలని చైతన్య పరిచేవారని తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య ( ఎఐవైఎఫ్ ) జిల్లా ప్రధాన కార్యదర్శి గా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా బాధ్యతల్లో ఎందరో యువకుల్ని చైతన్య చేసి యువజన సమస్యలపై పోరాటాలు చేశారన్నారు. పట్టణంలో విశాలాంధ్ర దినపత్రికను సైకిల్ మీద ఇంటింటికి వేసేవారని తెలిపారు. జీవితంలో ఎన్ని ఆటుపోటులు, ఒడిదుడికులు ఎదురైన కుంగిపోకుండా తాను నమ్మిన ఎర్ర జెండ, మార్క్సిజం, లెనినిజం, సిద్దాంతం, ప్రజలు, కార్మికుల కోసం మెడలో ఎర్ర కండువాతో ఎర్ర బాటలో తన ప్రయాణం తుది శ్వాస విడిచే వరకు కొనసాగించారన్నారు. ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నా లెక్కచేయకుండా చివరి వరకు కార్మిక సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారని. ఆయన 48 సంవత్సరాలు కార్మక నాయకుడిగా నిస్వార్థంగా పని చేస్తూ సొంత ఇల్లు కానీ, ఎలాంటి ఆస్తిపాస్తులు కానీ సంపాదించుకోకపోయిన అంతకుమించిన ఆస్తి కార్మికుల గుండెల్లో ఓ సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. అంతేకాకుండా ఆయన పెద్దకుమారుడు బుగత అశోక్ నీ పార్టీకి అందించి త్యాగం చేశారని తెలిపారు. కామ్రేడ్ సూరిబాబు కుటుంబం కమ్యునిస్టు పార్టీకి అంకితం అయ్యారని వారి కుటుంబం గొప్ప త్యాగాల కుటుంబం అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. రంగరాజు, జిల్లా సమితి సభ్యులు పొందూరు అప్పలరాజు, నియోజవర్గ సభ్యులు అప్పరుబోతు జగన్నాధం, పొందూరు రాంబాబు, బూర వాసు, కెల్ల సూర్యనారాయణ, పతివాడ శ్రీను, నంద గణేష్ మరియు ఐరన్, అపరాల, టింబర్, హార్డ్ వేర్ మేస్త్రీలు, కార్మికులు హాజరయ్యారు. (Story : బుగత సూరిబాబు పోరాట స్పూర్తితో  కార్మిక పోరాటాలు కొనసాగిస్తాం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1